Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enni Thalachina Edi Adigina Jarigedi Nee Chitthame

ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే

Enni Thalachina Edi Adigina Jarigedi Nee Chitthame

Verse
పల్లవి: ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే
ఎన్ని తలచినా - ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే
నీ వాక్కుకై - వేచి యుంటిని - నా ప్రార్ధన ఆలకించుమా
ప్రభువా - నా ప్రార్ధన ఆలకించుమా
Verse
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు
అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
Verse
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి
ఆరిపోయిన నా వెలుగు దీపము - ఆరిపోయిన నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో - ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో
Verse
ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి
లోకమంతయు నన్ను విడిచినా - లోకమంతయు నన్ను విడిచినా
నీ నుండి వేరు చేయవు - ప్రభువా నీ నుండి వేరు చేయవు

Related Tags

PrayerSurrenderGods Will