Verse
ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు
ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు‖ 2x ‖
నీకే నీకే నీకే పాదాభివందనము
నీకే నీకే నీకే స్తోత్రాభివందనము‖ ఎన్నిక ‖
Verse
బాధల నుండి బంధకము నుండి నను విమోచించినావు
ఎన్నడు తరగని ఆనందం నాకు దయచేసినావు‖ 2x ‖
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను‖ 2x నీకే ‖
Verse
పాపము నుండి మరణము నుండి నన్ను తప్పించినావు
ఎవ్వరు చూపని మమకారం నాకు రుచి చూపినావు‖ 2x ‖
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను
ఏ రీతి నిను నేను సేవించను‖ 2x నీకే ‖