Verse
ఎన్నిరోజులగునో యేసుని సువార్త
అన్ని దేశములకు అందించ ఎన్నిరోజులగునో‖ 2x ‖
Verse
సాతాను తంత్రములు పెరిగెడి రోజులలో
దేవుని పిల్లలందు ఐక్యత కనిపించునా‖ 2x ‖
Verse
అక్కర పెరుగుచుండ అవకాశము చేజార
దీనులై సేవకులు కలిసెడి రోజెపుడో‖ 2x ‖
Verse
కోపము క్రోధములు విసుకు విభజనలు
దేవుని సంఘమును ఎన్నడు విడనాడన్‖ 2x ‖