Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enno Enno Melulu Chesaavayyaa

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

Enno Enno Melulu Chesaavayyaa

Lyricist: Shubhakar Rao
Verse
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ‖ 2x ఎన్నో ‖
Verse
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు‖ 2x ‖
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా‖ 2x ‖
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా‖ 2x ఎన్నో ‖
Verse
శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు‖ 2x ‖
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు‖ 2x ‖
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా‖ 2x ఎన్నో ‖

Related Tags

PraiseThanksgiving