Verse
ఎంత మధురము యేసువాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును
Verse
అలసిసొలసిన సేదదీర్చును కరువు బరువులో ఆదరించును
కృంగినవేళ లేవనెత్తును శోధనవేళ జయమునిచ్చును
Verse
ఆకలైనను ఆహారమిచ్చును శోకమైనను కన్నీరు తుడుచును
చింతలైనను మాన్పివేయును చెంతజేరన సంతోషమిచ్చును
Verse
చీకటైనను వెలుగు చూపును పాపినైనను మార్చివేయును
వింతప్రేమను బయలుపరచును వెంబడించిన మేలుకలుగును