Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Aascharyakarudo Yanna Enchalemu Maa Ya

ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా య

Entha Aascharyakarudo Yanna Enchalemu Maa Ya

Verse 1
ఎంత ఆశ్చర్యకరుడో యన్నా ఎంచలేము మా యేసన్నను
ఎంత పాపినైన యేసన్నా వింతగాను
రక్షించు నన్నా ఎంత అంధకారమైనను
ఎన్ని బంధకములైనను అన్ని సరిచేయును యేసన్నా
Verse
కుంటివారికి కాలుచేతులు కన్నులు లేని కబోదులైనను
మన్ననతో నిల మంచిగ చేసిన మంచి ప్రభుడు యేసన్నా
Verse
ఆకలిగొన్న వారికి అన్నము పేదల బీదల బాధలు తీర్చెడి
స్వర్గమునకు ఒక మార్గము చూపిన సజ్జనుడు యేసన్నా
Verse
నాయఘములకై నీచుని వలెను సిలువను పొంది చావును గెలిచి
నాకును నా దేవునికిని మద్య మధ్యవర్తి యేసన్నా
Verse
అట్టి శ్రమలు పొంది లేచిన ఆ క్రీస్తుని నమ్మిన యెడల
నిశ్చయముగ నీకు రక్షణ నిచ్చును రక్షకుడు యేసన్నా

Related Tags

PraiseWorshipSalvation