Verse
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా‖ 2x ‖
యేసు వైపు చూడు నీ భారమంత తీరు‖ 2x ‖
తీరానికి చేరు‖ 2x ఎంతో ‖
Verse
నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా‖ 2x ‖
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా‖ 2x యేసు ‖
Verse
తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా‖ 2x ‖
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా‖ 2x యేసు ‖