Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Goppa Bobba Puttenu Daanitha

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానిత

Entha Goppa Bobba Puttenu Daanitha

Lyricist: Mungamuri Devadasu
Chorus
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతో
సిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను‖ ఎంత ‖
Verse
గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు
పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను
నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి‖ ఎంత ‖
Verse
పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీఁద చావునొందెడు
సమయమందున దేవుఁడా నా దేవుఁడా నన్నేల చెయివిడిచితివి యనియా
రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను‖ ఎంత ‖
Verse
అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను
బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను
పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును‖ ఎంత ‖
Verse
శాంతమాయె నటంచుఁ బలుకుచును ఆ రక్షకుఁడు తన స్వంత విలువగు
బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుఁడు తనదగు నీటెతోఁ ప్రభు
ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధారఁ గారెను‖ ఎంత ‖

Related Tags

SalvationGood FridayCrucifixion