Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Jaali Yesuvaa

ఎంత జాలి యేసువా

Entha Jaali Yesuvaa

Lyricist: Songs Of Zion
Verse
ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను‖ ఎంత ‖
Verse
హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను‖ 2x ‖
అవిశ్వాసినైన నన్ను‖ 2x ‖
ఆదరించినావుగా‖ ఎంత ‖
Verse
రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు‖ 2x ‖
సిలువయందు సొమ్మసిల్లి‖ 2x ‖
చావొందితివి నాకై‖ ఎంత ‖
Verse
ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా‖ 2x ‖
రక్షణంపు పాత్రనెత్తి‖ 2x ‖
స్తొత్రమంచు పాడెద‖ ఎంత ‖
Verse
నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై‖ 2x ‖
నాథుడా నీ విచ్చు మేలు‖ 2x ‖
ఎంత గొప్పదేసువా‖ ఎంత ‖
Verse
నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు‖ 2x ‖
నిశ్చయముగ నీవు నాకు‖ 2x ‖
ఇచ్చువాడా ప్రభువా‖ ఎంత ‖
Verse
నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు‖ 2x ‖
నాదు కాపరివి నీవు‖ 2x ‖
నాకు లేమి లేదుగా‖ ఎంత ‖
Verse
అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా‖ 2x ‖
హల్లెలూయ స్తోత్రములను‖ 2x ‖
హర్షముతో పాడెద‖ ఎంత ‖

Related Tags

PraiseWorshipGrace