Verse
ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను
Verse
హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను - ఆదరించినావుగా
Verse
రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై
Verse
ఏమి నీ కర్పించగలను - ఏమి లేమి వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తొత్రమంచు పాడెద
Verse
నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా
Verse
నీను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా పభువా
Verse
నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చు వాడ వీవు
నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా
Verse
అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెద