Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Krupaamayudavu

ఎంత కృపామయుడవు

Entha Krupaamayudavu

Lyricist: Gottipati Yesudasu
Verse
ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా‖ 2x ‖
నలిగితివి వేసారితివి‖ 2x ‖
నాకై ప్రాణము నిచ్చితివి‖ 2x ఎంత ‖
Verse
బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం‖ 2x ‖
మార్చినావు నీ స్వాస్థ్యముగా‖ 2x ‖
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము‖ 2x ఎంత ‖
Verse
కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ‖ 2x ‖
మరువలేదు నన్ను విడువలేదు‖ 2x ‖
ప్రేమతో పిలచిన నాథుడవు‖ 2x ఎంత ‖
Verse
కరువులు కలతలు కలిగిననూ
లోకమంతా ఎదురై నిలచిననూ‖ 2x ‖
వీడను ఎన్నడు నీ సన్నిధి‖ 2x ‖
నీ త్యాగమునే ధ్యానించెదన్‖ 2x ఎంత ‖

Related Tags

GraceRepentanceSacrificeLove