Chorus
ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
Verse
అంధకార బంధము నన్నావరింపగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని
బంధము తెంచెను బ్రతికించెను నన్ను
Verse
రక్షించువారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురిపెట్టి యుండెను
బంధము తెంచెను బ్రతికించెను నన్ను
Verse
ఎన్నో పాపములు చేసి మూటకడితిని
ఎన్నో దోషములు చేసి దోషినైతిని
బంధము తెంచెను బ్రతికించెను నన్ను
Verse
కుష్ఠు బ్రతుకునై నేనున్ కృంగియుండగా
భ్రష్ఠుడనైన నన్ను బ్రతికించెనుగా
బంధము తెంచెను బ్రతికించెను నన్ను