Chorus
ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవయ్యా
చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా‖ 2x ‖
Verse
ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా‖ 2x ‖
Verse
నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ
నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా‖ 2x ‖
Verse
నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా
నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా‖ 2x ‖