Verse
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా‖ 2x ఎంత ‖
Verse
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా‖ 2x ‖
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా‖ 2x ఎంత ‖
Verse
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ‖ 2x ‖
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా‖ 2x ఎంత ‖
Verse
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా‖ 2x ‖
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా‖ 2x ఎంత ‖