Verse
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి‖ 2x ‖
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య‖ 2x ఎంత ‖
Verse
సుఖములంటూ లోకమంటూ
నీదు వాక్యము మరచితి
నీదు సన్నిధి విడచితి‖ 2x ‖
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి‖ 2x ఎంత ‖
Verse
నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు‖ 2x ‖
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను‖ 2x ఎంత ‖