Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Paapi Nainanu Yesu Cherchukona

ఎంత పాపి నైనను యేసు చేర్చుకొన

Entha Paapi Nainanu Yesu Cherchukona

Lyricist: Erdman Neumeister
Verse
ఎంత పాపి నైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంతటఁ జాటించుఁడి
హల్లెలూయ హల్లెలూయ‖ హల్లెలూయ ‖
యెంత పాపి నైనను
యేసు చేర్చుకొన
టంచుఁ బ్రకటించుఁడి
Verse
మెండుగా క్షమాపణన్
పూర్ణ సమాధానము
నెంత పాపి కైనఁ దా
నిచ్చి చేర్చుకొనును.
Verse
తన దివ్య సిల్వచేఁ
దీసి పాప శాపమున్
నన్ బవిత్రపర్చెను
నాకు హాయి నిచ్చెను
Verse
ఘోర పాపి నైనను
నన్ను ఁ జేర్చుకొనును
పూర్ణశుద్ధి నిచ్చును
స్వర్గమందుఁ జేర్చును

Related Tags

GraceSalvationForgiveness