Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Paapinainanu

ఎంత పాపినైనను

Entha Paapinainanu

Lyricist: Erdmann Neumeister
Verse
ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంత జాటించుడి
Chorus
హల్లెలూయ హల్లెలూయ
ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున
టంచు బ్రకటించుడి
Verse
మెండుగా క్షమాపణన్
పూర్ణ సమాధానము
నెంత పాపి కైన దా
నిచ్చి చేర్చుకొనును‖ హల్లెలూయ ‖
Verse
తన దివ్య సిల్వచే
దీసి పాప శాపమున్
నను బవిత్రపర్చెను
నాకు హాయి నిచ్చెను‖ హల్లెలూయ ‖
Verse
ఘోర పాపినైనను
నన్ను జేర్చుకొనును
పూర్ణ శుద్ధి నిచ్చును
స్వర్గమందు జేర్చును‖ హల్లెలూయ ‖

Related Tags

GospelRepentanceSalvation