Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Pedda Poraatamo

ఎంత పెద్ద పోరాటమో

Entha Pedda Poraatamo

Lyricist: Prasanna Benhur
Verse
ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో‖ 2x ‖
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము‖ 2x ‖
Verse
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి‖ 2x ‖
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు‖ 2x ఎంత ‖
Verse
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి‖ 2x ‖
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు‖ 2x ఎంత ‖
Verse
యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి‖ 2x ‖
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు‖ 2x ఎంత ‖

Related Tags

FaithEncouragementSpiritual Warfare