Verse
ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో‖ 2x ‖
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము‖ 2x ‖
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి‖ 2x ‖
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు‖ 2x ఎంతో ‖
Verse
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి‖ 2x ‖
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు‖ 2x ఎంతో ‖
Verse
యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి‖ 2x ‖
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు‖ 2x ఎంతో ‖