Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Prema Yentha Prema Yentha Pre

ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రే

Entha Prema Yentha Prema Yentha Pre

Chorus
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత
గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే‖ ఎంత ‖
Verse
ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని
వచించు మనుజుఁ డెవ్వఁడు‖ ఎంత ‖
Verse
మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ
జగమందుఁ బొగడ మాట లందవే‖ ఎంత ‖
Verse
దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి
ఇంత యది యనెన్‖ ఎంత ‖
Verse
ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత
తంబు ప్రీతిఁ జేసెదన్‖ ఎంత ‖

Related Tags

Gods Love