Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entha Prema Yesayya

ఎంత ప్రేమ యేసయ్యా

Entha Prema Yesayya

Lyricist: Raj Prakash Paul
Verse
ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను‖ 2x ‖
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను‖ 2x ‖
నలిగిపోయెను – విరిగిపోయెను
Verse
ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు‖ 2x ‖
మనకు క్షమాపణ ఇచ్చెను
అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడి
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప
నా కోసమే ఈ యాగమా‖ ఎంత ప్రేమ ‖
Verse
సమస్తము సంపూర్ణమాయెను
జీవముకై మార్గము తెరిచెను‖ 2x ‖
అపవాదిని అణచివేసి
మరణ ముల్లును విరచి వేసెను
విజయశీలుడై తిరిగి లేచెను
పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను
పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే

Related Tags

RepentanceCrossSacrificeLove