Chorus
ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల
యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే‖ ఎంత ‖
Verse
పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై
తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని
జూడరే‖ ఎంత ‖
Verse
పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి
మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి
దేహము దాల్చి‖ ఎంత ‖
Verse
ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా
ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా‖ ఎంత ‖
Verse
మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి
వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన
రాజ్యమును మనకీయును‖ ఎంత ‖
Verse
గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు
డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము
వేడ్క‖ ఎంత ‖