Chorus
ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా‖ 2x ‖
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా‖ ఎంత ‖
Verse
దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని‖ 2x ‖
నా పాపమంత క్షమించితివి‖ 2x ‖
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి‖ ఎంత ‖
Verse
పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది‖ 2x ‖
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా‖ 2x ‖
క్షమియించి నీ రక్షణిచ్చితివి‖ ఎంత ‖
Verse
నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని‖ 2x ‖
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి‖ 2x ‖
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి‖ ఎంత ‖