Chorus
ఎంత సౌందర్య నగరము
అద్భుత మహిమ ప్రభావముతో నిండెను
పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం, అన్నియు
Verse
ఆ నగర పునాది ఎంతో దృఢమైనది
స్థిరమై కదలని శాశ్వతమైనది
ప్రభువే తన వారిన్ సిద్ధపరచుచున్నాడు
అద్భుతం అద్భుతం అద్భుతనగరం
Verse
పవిత్ర జనులు తనతో వసింతురు
ఎవరిని ప్రభువు రక్తముతో కొనెనో
జయవంతులే అచ్చట చేరుదురు
విజయులై విజయులై అత్యంత విజయులై
Verse
ఇవి మానవులకు గ్రాహ్యము కానివి
ప్రభుని ఆత్మీయ జనులె గ్రహింతురు
ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్
ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం
Verse
ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం
యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను
పై నున్న వాటిని నిలచి చూతుము
ఆనందం ఆనందం పరలోక ఆనందం