Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enthadooramu Moyinchedaru Swamik

ఎంతదూరము మోయించెదరు స్వామికి

Enthadooramu Moyinchedaru Swamik

Chorus
ఎంతదూరము మోయించెదరు స్వామి
కింత సిలువనెత్తి నుంతైన దయలేక‖ ఎంత ‖
Verse
ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి
కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని‖ ఎంత ‖
Verse
సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద
నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును‖ ఎంత ‖
Verse
కరములు జోడించి కడకు గేత్సెమనిలో
పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి‖ ఎంత ‖
Verse
పిరికి పిలాతుని బెదరించి యదలించి
యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు‖ ఎంత ‖
Verse
ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా
ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు‖ ఎంత ‖
Verse
కలువరి గిరివరకు సిలువ మోయలేక
అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి‖ ఎంత ‖
Verse
యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను
దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు‖ ఎంత ‖

Related Tags

PassionSufferingCrucifixionLent