Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enthaga Ninu Keerthinchinanu - Ememi Arpinchinanu

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను

Enthaga Ninu Keerthinchinanu - Ememi Arpinchinanu

Verse
ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను‖ 2x ‖
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా‖ 2x ‖
Verse
ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా‖ 2x ‖
ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను‖ 2x ‖
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పించగలనా‖ 2x ప్రభువా ‖
Verse
కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి‖ 2x ‖
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…‖ ప్రభువా ‖
Verse
నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి‖ 2x ‖
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను హెచ్చించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…‖ ప్రభువా ‖

Related Tags

WorshipDevotionalGratitude