Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enthajaali Yesuvaa Yinthayani Yoohinchala

ఎంతజాలి యేసువా యింతయని యూహించల

Enthajaali Yesuvaa Yinthayani Yoohinchala

Chorus
ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను‖ ఎంత ‖
Verse
హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా‖ ఎంత ‖
Verse
రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై‖ ఎంత ‖
Verse
ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య
రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా‖ ఎంత ‖
Verse
నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై
నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా‖ ఎంత ‖
Verse
నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు
నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ‖ ఎంత ‖
Verse
నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ నీవు
నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా‖ ఎంత ‖
Verse
అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా‖ ఎంత ‖

Related Tags

PraiseWorshipSalvation