Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Enthentha Bhaaramaaye

ఎంతెంత భారమాయె

Enthentha Bhaaramaaye

Lyricist: Sayaram Gattu
Verse
ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ‖ 2x ‖
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని‖ 2x ‖
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా…‖ 2x ‖
Verse
కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను‖ 2x ‖
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను‖ 2x యేసయ్యా ‖
Verse
బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి‖ 2x ‖
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు‖ 2x యేసయ్యా ‖
Verse
చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో‖ 2x ‖
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము‖ 2x యేసయ్యా ‖
Verse
వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము‖ 2x ‖
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక‖ 2x యేసయ్యా ‖

Related Tags

Good FridaySacrificePassion Of Christ