Verse
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి మన కొరకై
చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె‖ ఎంతో ‖
Verse
పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు‖ ఎంతో ‖
Verse
బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే‖ ఎంతో ‖
Verse
పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు‖ ఎంతో ‖