Chorus
ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా
యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు
ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ
గా‖ ఎంతో ‖
Verse
వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను
మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా‖ యెంతో ‖
Verse
సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు
పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను‖ ఎంతో ‖
Verse
కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు
పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము‖ ఎంతో ‖
Verse
నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి
నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ
జూపినావా‖ ఎంతో ‖
Verse
చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా
యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా‖ ఎంతో ‖
Verse
అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ
డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా‖ ఎంతో ‖