Verse
ఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎంతో వినదగువారలు
సంతసంబుగ వార త్యంత ప్రేరణతోడ సొంతవారిని సహా సొంతంబుగ
విడచి చెంతజేరిరి యేసు ప్రభుని చింతలేకను వెంబడించి వింత
పనులను జేసి బ్రతికిరి అంతమువరకును నడచిరి‖ ఎంతో ‖
Verse
పేతు రపోస్తలుండు అతని సోదరు డతి ప్రియు డంద్రెయయు నీతి
నియమములందు ప్రీతితో బ్రదుకుచు చేతి పనులయందు శ్రద్ధతో
నుండుచు ఖ్యాతి నొందిన యోహాను అతని యన్న యాకోబుతోను ప్రతి
దినంబును కలిసి యుండుచు భక్తి ప్రభువును వెంబడించిరి‖ ఎంతో ‖
Verse
ఆస్తి నిచ్చిన బర్నబా ఆస్తిపరుడ పోసలులతో జేరెన్ స్వస్థబుద్ధి తోడ
ఆస్తివాడుట యెట్లో క్రీస్తు సేవకొరకు ఖర్చుపెట్టుట యెట్లో వాస్తవముగ
నేర్పినాడు ఆస్తిగలవారలకు నెల్ల ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు ప్రభువు
పనికియ్యవలెనని‖ ఎంతో ‖
Verse
సంఘమును హింసించిన సంఘాభిమాని సంఘ నాయకుడు పౌలు
సంఘముల నెన్నటినో చక్కగను స్థాపించి సంఘముల కుత్తరముల్
సమయానుకులముగ సంఘ కాపరులకును సహా సరియగు సలహాల
నిచ్చి సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా‖ ఎంతో ‖
Verse
కన్యయైన మరియమ్మ ధన్యురాలు కన్యలకు తల్లులకున్ను అన్యులకు
అందరికి ఆదర్శముగ నుండ సన్యాసిను లెందరో స్వామిని సేవించ
కన్యకలుగ నిలుచువారలు కఠినవ్రతములతోడ నుండి ధన్యులగు
పరిశుద్ధులతో దైవసన్నిధి నుండ జూపెను‖ ఎంతో ‖
Verse
మగదాలయూరి మరియ మహినినున్న మగువలలో కెల్లను భగవంతుడై
నట్టి ప్రభువు యేసునుజేరి నగము నెక్కెను తన సొగసైన మార్పుచే
సాగి మొదట సమాధికడకు స్వామిదర్శనమొంది మొదట వేగవెళ్లి శిష్యులకును
వెదకి సాక్ష్యమియ్యలేదా‖ ఎంతో ‖
Verse
మత్తయి మార్కులను వారు మతమునందు అతినిష్టగలవారలు మత్తయి
యూదులకై తన పుస్తకమును వ్రాసె మార్కు గూడను తన సు వార్తనందరి
కిచ్చె వాస్తవంపు జీవితమును వరుసగాను గలిగియుండ క్రీస్తు ప్రభువును
వెంబడించగ క్రొత్తలోకము జూపగలిగిరి‖ ఎంతో ‖
Verse
చూచననేగాని నమ్మనని పేచిపెట్టి నతోమయు చాచి చేయి చూచి
చక్కగ నమ్మెను చూడకుండనె లూక వైద్యుండు నమ్మెను యీ చొప్పున
వీరలిద్దరు నీచజనులకెల్లరకు తము బ్రోచు ప్రభువును జూపుచుందురు
బ్రోదిగా ప్రతిదినమునందును‖ ఎంతో ‖
Verse
ప్రభువా నీ పరిశుద్ధుల బ్రతుకునందు మా భాగ్యమునున్నదిహా
ప్రభువా వారి బ్రదుకు ప్రబలమైన సేవ విభవంగాగని విజయంబు
గాంచుచు వారితో నేలునట్లు యభయమియ్యు మాకు దేవా‖ ఎంతో ‖