Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Goppa Nithyamaina Poorna Rakshana Yidhe

ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే

Entho Goppa Nithyamaina Poorna Rakshana Yidhe

Chorus
ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే
నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ
Verse
మన ప్రభువే రక్షణ శృంగమాయె - శత్రువు నోడించ శక్తి మంతుడు
మనకు జయము నిచ్చును
Verse
ప్రభువే మన రక్షణ శైలమాయె - దృఢపరచె నాయనే మనల
పాదముల స్థిరపరచెను
Verse
ప్రభువే మన రక్షణ దుర్గమాయె - తనయందే మనకు పూర్ణ భద్రత
ప్రియమార దయచేయును
Verse
ప్రభువే మన రక్షణ కేడెమాయె - దుష్టుని బారినుండి తప్పించి
పదిలముగా రక్షించును
Verse
ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము - జీవము ద్వారా రక్షణ కనుపరచ
ఆశతోడ నుందుము
Verse
రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది - రక్షణ వూటచే సంతృప్తి కలిగె
పరిపూర్ణత నీవేగా
Verse
రక్షణ వస్త్రము ధరింప జేసెనుగా - నీతి వస్త్రములను ధరింపజేసి
ఆనందింప జేసెను

Related Tags

GraceSalvationProtection