Chorus
ఎంతో రమ్యంబైనది భూతలమందు ఎంతో మాన్యంబైనది చెంత జేరి
యేసు వింత పాదాబ్జముల సంతసంబున పూజసల్పు క్రైస్తవ గృహము‖ ఎంతో ‖
Verse
పిల్ల లొలీవ మొక్కలై బల్లల చుట్టు ఎల్లప్పుడు ఆడుచున్ నుల్లమందున
యేసు చల్లని వాక్యంబున్ నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము‖ ఎంతో ‖
Verse
తల్లిదండ్రు లైక్యత దనరుచునుండి దాక్షిణ్య నిధుల జిల్కి ఎల్లప్రేమామృత
మెల్ల వారల కొసగి కల్లోలములు వీడి నుల్లసిల్లెడి గృహము‖ ఎంతో ‖
Verse
పొరుగువారల మైత్రిని పొందుగ గోరి పొలుపారు నీతిన్ దనరు
నురుతరనాత్మ వరముల పైని గురిపించు వరదాత యేసున్ ప్రార్థించు
క్రైస్తవ గృహము‖ ఎంతో ‖
Verse
శోధనల నన్నింటిని సర్వదా పైచి శోభిల్లు విశ్వాసమున్ మోద మొందగ
యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము‖ ఎంతో ‖
Verse
వ్యర్థ ఖర్చుల మానుచు వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ వృద్ధి
నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా ఇద్ధరిత్రిని దశమభాగ మొసగెడు గృహము‖ ఎంతో ‖