Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Shrungara Mainadhi Yesuni Charitha

ఎంతో శృంగార మైనది యేసుని చరిత

Entho Shrungara Mainadhi Yesuni Charitha

Lyricist: Purushothamu Choudari
Chorus
ఎంతో శృంగార మైనది యేసుని చరిత మిది యెంతో వేడ్కై యున్నది
మోక్ష ప్రవేశ మంతటఁ దేజో వంతుఁడు క్రీస్తుఁడు చెంతను దూతా
శ్రితజన వజ్ఞ్క్తులు వింతగ నుడువఁగ సంతత నవ్య వ సంతము
గల్గియ నంతజీవ రస వంతఫలోప వనాంతర ములు ద త్ప్రాంత
ఋనగల పరమపురమునకు సంతసమున జనె జయశబ్దముతో‖ ఎంతో ‖
Verse
తెరచి మూయంగ రానట్టి ద్వారములారా మీ శిరము లెత్తుకొని యుండు
డి యనాదిగ నుండు వర క వాటములారా మీరే యెత్తంగఁ బడుఁడీ
సురచిన మహిమ స్ఫురణలుగల మీ దొరతన పరిశుద్ధుల కరు
లగు భీ కర దురితాత్ముల దురమునఁ జిదిపి య పరిమిత బల జయ
బిరుదాంకితు డై చిరముగ నూతన యెరుసలేమ పుర పరి
పాలనఁ ద త్పరుఁడై యిదిగో నెరవుగ వచ్చెను నిజ భక్తులతో‖ ఎంతో ‖
Verse
సుందర మందానిలమందు జీవ సంజీవా నందసౌఖ్య ప్రదమై యుండ
రేబగ లంటని మందిర వాసులప్పుడు జయజయశబ్దములఁ బొందుగఁ
గ్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందఱు పరమా నందంబునఁ జె
న్నొంది తనందరి కిందగు రాజుగ వందనములు తగ వరుస నొనర్చుచు
నందముగా ప్రభుఁ జెందిన భక్తుల బృందములకుఁ దగు విందు
లొనర్చిరి పొందిక కలిగెను భూమికి ముక్తికి‖ ఎంతో ‖
Verse
ములపైఁ బెట్టి కళ లీను ధవళ వస్త్రములు గట్టంగ నిచ్చి చెలువుగ
మరి వా రల చేతుల లో పల విజయార్థపు బర్ణము లొసఁగి సకల
దూతలు భ క్తులతో గూడి వి మల పీఠము ముం గల నిలువబడి
పొలువగఁ దమ దే వునకును గ్రీస్తున కెలమిని స్తోత్రము బలఘన
మనిశము కలుగును గాకని పలికి నుతించిరి‖ ఎంతో ‖
Verse
పరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద భరితులై వీణెలు ధరియించి
పాటులు బాడుచును గురురాయఁడైన తమ ప్రభుని గుణములు వర్ణించి
కరుణను నీ ర క్తముచే మము నం దఱి ధరణింగల నరవంశస్థుల
తరములలో నుం డరుదుగ దేవుని కొఱకుఁగదా మముఁ గొనియుంటిని
యని మురువుగ నిఁక దే వుని కొఱకుఁగదా మముఁ గొని
యుంటిని యని మురువుగ నిఁక దే వుని సముఖంబున దొరలను
నర్చక వరులఁ జేసితివి ధర నేలుదు మిఁక సరియని మ్రొక్కిరి‖ ఎంతో ‖

Related Tags

WorshipJesusGlory