Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Sundaramainavi Dhara Girulapai Nem

ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెం

Entho Sundaramainavi Dhara Girulapai Nem

Lyricist: Medikayala Sadhuvu
Chorus
ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత
తంబుఁ బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన
జేయ అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ
న నంత మగు శుభవార్తఁ జాటెడు వింత యగు బోధకుల పాదము‖ లెంతో ‖
Verse
మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు
వందుచుఁ గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ
మోటుజన మెరుఁగఁ పొందుగాఁ ప్రభు యే సొసంగెడు సుందరం
బగు సత్య వాక్యం బందుకొని చాటించుచుండెడు అంద మగు బోధ
కుల పాదము‖ లెంతో ‖
Verse
మదిలోఁ ప్రభుని నమ్మిన పాపుల నెల్లఁ తుదిని మోక్ష పదమ్మున
విదితమ్ముగాఁ జేర్చి ప్రీతిఁ జూపున టంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద
సన్నిధిని జేర్ప సదయులై శుభవార్తమానము ముదమునను మదిలోన నిడి
కొని పదిలముగఁ ప్రకటించుచుండెడి విదితు లగు బోధకుల పాదము‖ లెంతో ‖
Verse
యేసు క్రీస్తు రారాజై యున్నాఁడనుచు భాసురంబుగఁ దెల్పుచు
వాసిగాఁ ప్రభు యేసు వసుధ రక్షకుఁడనుచు యీ సువార్తను జాటి
యిచట నెమ్మదినొంద దోసకారి జనంబు లందరి కీ సుమంగళ వార్తఁ
దెలుపుచు దోస మంతయుఁ బాపు మన ప్రభు యేసుఁ జూపెడు వారి
పాదము‖ లెంతో ‖

Related Tags

GospelEvangelism