Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Sundarudamma Thaanu

ఎంతో సుందరుడమ్మ తాను

Entho Sundarudamma Thaanu

Lyricist: M Prashanth Raju
Verse
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను‖ 2x ఎంతో ‖
Verse
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు‖ 2x ‖
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు‖ 2x ‖
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు‖ 2x ‖
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు‖ 2x ‖
అవలీలగా నతని గురితింపగలనమ్మా‖ 2x ఎంతో ‖
Verse
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు‖ 2x ‖
మరులు మనసున నింపు మహనీయుడాతండు‖ 2x ‖
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు‖ 2x ‖
సిరులు కురిపించేను వర దేవ తనయుండు‖ 2x ‖
విరబూయు పరలోక షారోను విరజాజి‖ 2x ఎంతో ‖
Verse
పాలతో కడిగిన నయనాలు గలవాడు‖ 2x ‖
విలువగు రతనాల వలె పొదిగిన కనులు‖ 2x ‖
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు‖ 2x ‖
కలుషము కడిగిన కమలాల కనుదోయి‖ 2x ‖
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు‖ 2x ఎంతో ‖
Verse
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన‖ 2x ‖
చలువ రాతిని బోలు బలమైన పాదాలు‖ 2x ‖
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు‖ 2x ‖
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ..‖ 2x ‖
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు‖ 2x ఎంతో ‖
Verse
అతడతికాంక్షానీయుండు తనయుండు‖ 2x ‖
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు‖ 2x ‖
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు‖ 2x ‖
ఆతని నొరతి మధురంబు మధురంబు‖ 2x ‖
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస‖ 2x ఎంతో ‖

Related Tags

PraiseWorship