Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Vintha

ఎంతో వింత

Entho Vintha

Verse
ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత‖ 2x ‖
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత‖ 2x ఎంతో ‖
Verse
పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా‖ 2x ‖
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు‖ 2x ఎంతో ‖
Verse
మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని‖ 2x ‖
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి‖ 2x ఎంతో ‖
Verse
కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్‖ 2x ‖
కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి‖ 2x ఎంతో ‖
Verse
దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా‖ 2x ‖
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా‖ 2x ఎంతో ‖
Verse
బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా‖ 2x ‖
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు‖ 2x ఎంతో ‖

Related Tags

Good FridaySufferingPassion Of Christ