Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Entho Vintha Entho Chintha Yesunadhun Maranamantha

ఎంతో వింత ఎంతో చింత యేసునాధున్ మరణమంత

Entho Vintha Entho Chintha Yesunadhun Maranamantha

Chorus
ఎంతో వింత ఎంతో చింత -యేసునాధున్ మరణమంత
పంతముతోఁ జేసిరంతా-సొంత ప్రజలూ యేసునంత‖ ఎంతో ‖
Verse
పట్టి కట్టి నెట్టి కొట్టి-తిట్టి రేసునాధు నకటా=అట్టి శ్రమల
నొంది పలుక-డాయె యేసు రేడునాడు‖ ఎంతో ‖
Verse
మొయ్యలేని మ్రాను నొకటి-మోపిరేసు వీపుపైని =మొయ్య
లేక మ్రానితోడ-మూర్చబోయేఁ నేసు తండ్రి‖ ఎంతో ‖
Verse
కొయ్యపై నేసయ్యను బెట్టి-కాలు సేతులలోఁ జీలల్=కఠిను
లంతగూడి కొట్టిరి-ఘోరముగ క్రీస్తేసున్ బట్టి‖ ఎంతో ‖
Verse
దాహముగొనఁ జేదుచిరకఁ-ద్రావ నిడిరి ద్రోహులకటా=
ధాత్రిఁ ప్రజల బాధకోర్చి -ధన్యుడా దివికేగె నహహా‖ ఎంతో ‖
Verse
బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ - బారె నీరు రక్త మహహా
యేరై పారె యేసు రక్త-మెల్ల ప్రజల కెలమి నొసగు‖ ఎంతో ‖

Related Tags

Good FridaySacrificePassion Of Christ