Chorus
ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత పంతము తోఁ
జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత‖ ఎంతో ‖
Verse
పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా అట్టి శ్రమల నొంది
పలుకఁ డాయె యేసు స్వామి నాఁడు‖ ఎంతో ‖
Verse
మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడ
మూర్ఛఁబోయె నేసు తండ్రి‖ ఎంతో ‖
Verse
కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలోఁ జీలల్ కఠిను లంత గూడి
కొట్టిరి ఘోరముగఁ క్రీస్తేసున్ బట్టి‖ ఎంతో ‖
Verse
దాహముగొనఁ జేదు చిరకఁ ద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రిఁ ప్రజల
బాధ కోర్చి ధన్యుఁడా దివి కేగె నహహా‖ ఎంతో ‖
Verse
బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు
రక్త మెల్ల ప్రజల కెలమి నొసఁగు‖ ఎంతో ‖