Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Epaati Daananayaa

ఏపాటి దాననయా

Epaati Daananayaa

Lyricist: Chrisostam
Verse
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు‖ 2x ‖
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి‖ 2x ‖
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది‖ ఏపాటి ‖
Verse
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు‖ 2x ‖
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా‖ ప్రేమించే ‖
Verse
నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా‖ 2x ‖
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా‖ ప్రేమించే ‖

Related Tags

PraiseWorshipGrace