Verse
ఎప్పుడో ఎక్కడో జన్మించిన మీరిరువురు
దేవుని ప్రేమలో జతపరచబడే వేళలో‖ 2x ‖
సంతోషం ఎదలో పొంగింది – మీ ఇరువురిలో
ఆనందం మదిలో నిండింది – మా అందరిలో
ఆశీర్వాదములే కురిసినవి – ఈ వేడుకలో
కలకాలం జతగా ఉండుటకే – ఈ లోకంలో
విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్
వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్‖ 2x ఎప్పుడో ‖
Verse
ఒంటరిగా నుండుట మంచిది కాదని
నరునికి సహకారిగా స్త్రీని నిర్మించెను‖ 2x ‖
సంఘమునకు క్రీస్తేసే శిరస్సైనట్టుగా
భార్యకు శిరస్సుగా భర్తను నియమించెగా‖ 2x ‖
ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యం
దేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం‖ 2x ‖
విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్
వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్‖ 2x ఎప్పుడో ‖
Verse
ఎముకలలో ఎముకగా దేహములో సగముగా
ఇరువురు ఒక్కటయ్యే ఈ నాటి నుండి‖ 2x ‖
క్రీస్తేసు సంఘమును ప్రేమించినంతగా
భార్యను భర్తయూ ప్రేమించవలెనుగా‖ 2x ‖
ఈ సత్యం తెలుసుకుంటే మీ జీవితమంతా సౌభాగ్యం
దేవునిపై కట్టుకుంటే మీ కుటుంబమంతా బహు ధన్యం‖ 2x ‖
విష్ యు ఎ బ్లెస్సెడ్ హ్యాప్పీ మార్రీడ్ లైఫ్
వి విష్ యు వండర్ఫుల్ రైడ్ ఇన్ గాడ్స్ ఐ సైట్‖ 2x ఎప్పుడో ‖