Verse
ఎరిగియుంటివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగి‖ ఎరిగి ‖
భూమి పునాదులు వేయకముందే
ఆకాశము సహా లేకున్నపుడే
ఇలపర్వతములు నిలవకముందే
కనబడు ప్రతిదియు లేకున్నపుడే - ఎరిగి‖ ఎరిగి ‖
Verse
నిర్ణయించితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణ‖ నిర్ణ ‖
పరమున కూటము జరుగకముందే
రక్షణ వెలుగుకు రాకున్నపుడే
ప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడే
యేసు రూపమిల్ నేర్పడనపుడే - నిర్ణ‖ నిర్ణ ‖
Verse
పేరున పిల్చితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - పేరున‖ పేరున ‖
చేత ఆదామును చేయకముందే
హానోకు నీతో నడువకముందే
నోవాహును రక్షింపకముందే
పిత్రుడబ్రామును పిలువకముందే - పేరున‖ పేరున ‖
Verse
నీతిగ తీర్చితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ‖ నీతిగ ‖
గర్భములో నే కలుగకముందే
కాలపరిమితి కాకున్నపుడే
కటిక చీకటి కాకున్నపుడే
నిర్దేవుడనై నేనుండగనే - నీతిగ‖ నీతిగ ‖
Verse
మహిమ పరచితివే - యెహోవా
యేసుక్రీస్తునందు నన్ను - మహిమ‖ మహిమ ‖
తేజోమయముగ దివిరాజ్యమున
దూత గణంబులు ప్రీతిగ పొగడ
తరుగని నిత్యతండ్రి మహిమతో
మహిమ రూపుడగు మరియ సుతునితో - మహిమ‖ మహిమ ‖