Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Eringi Yerigi Chedipothivi Manasa

ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా

Eringi Yerigi Chedipothivi Manasa

Lyricist: Purushothamu Choudari
Chorus
ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా
దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ‖ యెఱిఁగి ‖
Verse
ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు
ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున
బడితివి యెఱిఁగి‖ యెఱిఁగి ‖
Verse
సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక
జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని‖ యెఱిఁగి ‖
Verse
ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు
తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో‖ యెఱిఁగి ‖
Verse
గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై
వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో యెఱిఁగి‖ యెఱిఁగి ‖
Verse
పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు
బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు యెఱిఁగి‖ యెఱిఁగి ‖
Verse
అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపఁడు నీపై
కృపా వాగ్దద్తము లెపుడు దలఁచి నీ యపవిత్రతఁ గని హా యని
యేడ్వుము యెఱిఁగి‖ యెఱిఁగి ‖

Related Tags

RepentanceChristian Life