Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Etu Choochinaa Yuddha

ఎటు చూచినా యుద్ధ

Etu Choochinaa Yuddha

Verse
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువూ భూకంపాలు
ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా ఓ సోదరీ‖ 2x ‖
రాకడ గురుతులని తెలుసుకోవా
తినుటకు త్రాగుటకు ఇది సమయమా‖ ఎటు ‖
Verse
మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ
యోవాబుని సేవకులు దండులో నుండగను‖ 2x ‖
తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు‖ 2x ‖
ఇది సమయమా.. ఇది సమయమా.. అని
ఆనాడు ఊరియా దావీదునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు‖ ఎటు ‖
Verse
నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను‖ 2x ‖
యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా‖ 2x ‖
సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని
ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు‖ ఎటు ‖
Verse
ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు
సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు‖ 2x ‖
ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా‖ 2x ‖
తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని
నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు
ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు‖ ఎటు ‖

Related Tags

PrayerRepentanceEnd Times