Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Etuvanti Yaagamu Jaesithivi Yaesu Neevale Naenumda Naa Korakai

ఎటువంటి యాగము జేసితివి యేసు నీవలె నేనుండ నా కొరకై

Etuvanti Yaagamu Jaesithivi Yaesu Neevale Naenumda Naa Korakai

Chorus
ఎటువంటి యాగము జేసితివి యేసు
నీవలె నేనుండ నా కొరకై
Verse
పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి
పశువుల తొట్టిలో పరుండియు
పరమ ప్రేమన్ జూపెను
Verse
జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చువరకు
మాకై సిలువ బాధ నొందితివి
మమ్మును విమోచించన్
Verse
తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండే నీకు
నీయడుగు జాడలలో నేనుండన్
నాముందు వెళ్ళితివి
Verse
తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి
నీ సిలువ మోయు వారెల్లరును
నీ మహిమ జూచెదరు
Verse
నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి దెచ్చెనిన్ను
నీకై నా జీవమెల్ల నియ్యను
నీ శ్రమలే నే కోరెదన్
Verse
నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు
నీ వెంట వెళ్ళను నే వెరువను
నీ ప్రేమ నాలో నుండ

Related Tags

Good FridaySacrificeJesus Christ