Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evani Athikramamulu Mannimpabadeno

ఎవని అతిక్రమములు మన్నింపబడెనో

Evani Athikramamulu Mannimpabadeno

Chorus
ఎవని అతిక్రమములు మన్నింపబడెనో
పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు
Verse
యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు
ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు‖ ఎవని ‖
Verse
మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి
ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను‖ ఎవని ‖
Verse
దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ
నా సారము వేసవిలో ఎండినట్లాయె‖ ఎవని ‖
Verse
నేను నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని‖ ఎవని ‖
Verse
నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
నీవు నా దోషమును మన్నించితివిగా‖ ఎవని ‖
Verse
కావున నీ దర్శనకాలమందు
భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు‖ ఎవని ‖
Verse
విస్తార జలప్రవాహము పొర్లినను
నిశ్చయముగ అవి వారి మీదికి రావు‖ ఎవని ‖
Verse
నాకు దాగుచోటు నీవే శ్రమలోనుండి
నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా‖ ఎవని ‖
Verse
విమోచన గానములతో నీవు నన్ను
ఆదరించి నాకుపదేశము చేసెదవు‖ ఎవని ‖

Related Tags

RepentanceSalvationBlessingForgiveness