Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evaraina Unnara Echataina Unnara

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

Evaraina Unnara Echataina Unnara

Chorus
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
ఈలాటి స్నేహితుడు
నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు
Verse
హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా
ప్రేమ చూపువారు లేరు లోకమందునా
నేను కోరుకోకుండా నాకోసము
తనకు తాను చేసినాడు సిలువయాగము‖ ఎవరైనా ‖
Verse
అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా
నీచుడనని చూడకుండా నాకోసము
మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము‖ ఎవరైనా ‖
Verse
స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
మేలు చేయువారు ఎవరు విశ్వమందునా
ఏమి దాచుకోకుండా నాకోసము
ఉన్నందతా ఇచ్చినాడు ఏమి త్యాగము‖ ఎవరైనా ‖

Related Tags

SacrificeJesusFriendship