Verse
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము‖ 2x ‖
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం‖ 2x ఎవరి ‖
Verse
ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా‖ 2x ‖
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా….‖ ఎవరి ‖
Verse
జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము‖ 2x ‖
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని‖ ఎవరి ‖