Chorus
ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో‖ 2x ఎవరికి ‖
Verse
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు‖ 2x ‖
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు‖ 2x ఎవరికి ‖
Verse
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు‖ 2x ‖
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా‖ 2x ఎవరికి ‖
Verse
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా‖ 2x ‖
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు‖ 2x ఎవరికి ‖