Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Evariki Evaru Ee Lokamulo

ఎవరికి ఎవరు ఈ లోకములో

Evariki Evaru Ee Lokamulo

Lyricist: Bharat Mandru
Verse
ఎవరికి ఎవరు ఈ లోకములో
ఎంతవరకు మనకి బంధము
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికి ఎవరు శాశ్వతము
Verse
మన జీవితం ఒక యాత్ర
మన గమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే ఒక తపన
Verse
తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంతవరకే
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే
స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ
నీ ధనమున్నంతవరకే
ఈ లోక శ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే
యేసులో విశ్వాసము యేసుకై నిరీక్షణ
కాదెన్నడు నీకు వ్యర్థం

Related Tags

FaithLifeReflection